---Advertisement---

ఆరు గ్యారెంటీల పేరుతో మోసం.. సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి: హరీశ్ రావు!

September 5, 2026

Summarize with AI

---Advertisement---

ఆరు గ్యారెంటీల(Six Guarantees) పేరుతో ప్రజలను(People) మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెంటనే తన పదవికి రాజీనామా(Resignation) చేయాలని బీఆర్ఎస్(BRS) ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Tanneeru Harish Rao) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) 1,000 రోజుల పాలనలో విఫలమైందంటూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా శనివారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. విద్యా వ్యవస్థపై(Education System) అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే పాలిటెక్నిక్ కళాశాలలను(Polytechnic Colleges) ప్రైవేట్ రంగంలోకి నెట్టడం, ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) నిధులు విడుదల చేయకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. కేసీఆర్(KCR) రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ర్యాలీలు నిర్వహించడం దొంగే పోలీసును దొంగ అంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

రైతుబంధు(Rythu Bandhu), రైతుబీమా(Rythu Bima), కేసీఆర్ కిట్(KCR Kit) వంటి పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త పథకాలను మాత్రం ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.

మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.2,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించిందని తెలిపారు.

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

పాలిటెక్నిక్ విద్యను నైపుణ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యను నైపుణ్య విశ్వవిద్యాలయంలో విలీనం చేయాలంటూ తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు 300 ప్రైవేట్ కళాశాలలు (Private Colleges) మూతపడ్డాయని హరీశ్ రావు పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాల పేరుతో విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్.. ఉద్యోగాలు లేని క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు.

జెన్ జీ యువతను తక్కువ అంచనా వేస్తే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడం ఖాయమని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించడంపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల పక్షాన అసెంబ్లీలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులపై కేసులు పెట్టకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం, 2 లక్షల ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment