---Advertisement---

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మళ్లీ హరివంశ్ నారాయణ్.. 3వసారి అవకాశం, మోడీ అభినందనలు

April 17, 2026

---Advertisement---

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ మరోసారి ఎన్నికయ్యారు. ఆయనకు ఇది వరుసగా 3వసారి ఈ కీలక బాధ్యతలు దక్కడం విశేషం. తాజా ఎన్నికతో పెద్దల సభలో ఆయన అనుభవానికి మరోసారి గుర్తింపు లభించింది.

హరివంశ్‌కు మోడీ శుభాకాంక్షలు

హరివంశ్ ఎన్నికపై ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. రాజ్యసభ నిర్వహణలో ఆయన అనుభవం సభకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై హరివంశ్‌కు మంచి పట్టుందని, సభా విధానాలు, నియమాలపై పూర్తి అవగాహన ఉందని మోడీ తెలిపారు.

హరివంశ్ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేశారు. తర్వాత ఏప్రిల్ 10న ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శుక్రవారం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించగా, మరోసారి హరివంశ్‌కే అవకాశం లభించింది. దీంతో ఆయనపై కేంద్ర ప్రభుత్వ నమ్మకం మరోసారి స్పష్టమైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment