---Advertisement---

శంషాబాద్‌లో కలకలం.. రూట్ మార్చి మహిళపై క్యాబ్ డ్రైవర్ దారుణ యత్నం!

September 28, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌ (Hyderabad) శంషాబాద్‌ (Shamshabad) పరిధిలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌(Cab Driver) దారుణానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలికి చెందిన 35 ఏళ్ల మహిళను(Women) క్యాబ్‌లో తీసుకెళ్తున్న సమయంలో డ్రైవర్‌ అకస్మాత్తుగా రూట్‌ (Route) మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు(Police) తెలిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి (Sexual Assault) యత్నించడంతో పాటు, ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదును (Cash) లాక్కుని పరారైనట్లు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు ఆదివారం సాయంత్రం వ్యక్తిగత పనిమీద క్యాబ్‌లో ప్రయాణించింది. ఆమె వద్ద రూ.60 వేల నగదు ఉన్న బ్యాగ్‌(Bag) ఉంది. తొండుపల్లి టోల్‌ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్‌ అకస్మాత్తుగా మార్గాన్ని మార్చి కొత్వాల్‌గూడ (Kotwalguda) సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని తీసుకెళ్లాడు.

అక్కడ మహిళపై లైంగిక దాడికి యత్నించడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. అయితే ధైర్యం చేసి వెంటనే క్యాబ్‌ నుంచి కిందకు దిగి గట్టిగా కేకలు వేసింది. దీంతో డ్రైవర్‌ ఆమె వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఒంటరిగా క్యాబ్‌లో ప్రయాణించే మహిళలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. క్యాబ్‌ ఎక్కే ముందు వాహనం నంబర్‌(Vehicle Number), డ్రైవర్‌ వివరాలను (Driver Details) కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవాలి. ప్రయాణ సమయంలో జీపీఎస్‌ లొకేషన్‌ను (GPS Location) ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని ఇతరులు గమనించేలా చేయవచ్చు.

డ్రైవర్‌ నిర్ణీత మార్గం నుంచి వేరే రూట్‌లోకి వెళ్తే వెంటనే ప్రశ్నించాలి. అనుమానం కలిగించే పరిస్థితి ఎదురైతే వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ‘డయల్‌ 112’కు సమాచారం అందించాలి. తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన ‘హాక్‌ ఐ’ (HAWK-EYE) యాప్‌లోని అత్యవసర బటన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment