ఆసియా గేమ్స్ 2026 (Asia Games 2026) కోసం భారత జట్టును (Team India) బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌లో జపాన్‌లో (Japan) జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఊహించని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు టీ20 జట్టుకు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), హర్ధిక్ పాండ్యాలను (Hardik Pandya) పక్కన పెట్టిన సెలెక్టర్లు ఈసారి శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మను (Tilak Varma) వైస్ కెప్టెన్‌గా నియమించడం విశేషం. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి (Vaibhav Suryavanshi) తుది జట్టులో చోటు కల్పించడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది.
జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షదీప్ సింగ్, శివమ్ దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం దక్కింది. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ భవిష్యత్ జట్టును సిద్ధం చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదే జట్టు త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొననుంది. ముఖ్యంగా తాజా జట్టులో అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ మినహా మిగతా వారంతా యువ ఆటగాళ్లే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువ రక్తంతో టీమ్ఇండియా కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోందని అభిమానులు భావిస్తున్నారు.






