డీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు (DSC Examinations Paper Leakages), స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో (Sport Quota Posts Recruitment) జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వెంటనే రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డీఎస్సీ పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల వరకు అన్ని అంశాలపై సీబీఐతో(CBI) సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన జగన్, డీఎస్సీ అక్రమాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న యువత(Youth), విద్యార్థులకు(Students) ప్రత్యేకంగా అభినందనలు (Congratulations) తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై (Chandrababu Naidu Government) జెన్-జీ యువత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
టీచర్ ఉద్యోగాల కోసం ఎన్నో నెలలుగా కష్టపడి సిద్ధమైన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, డీఎస్సీ పేపర్ లీకేజీలు, అక్రమాలతో వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని జగన్ ఆరోపించారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు రావాల్సిన యువతను రోడ్డెక్కించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు ప్రజల ముందే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు.
డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన… pic.twitter.com/C0ZpLL2hC3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026
డీఎస్సీ వివాదాన్ని డైవర్షన్ రాజకీయాలతో (Diversion Politics) పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. యువత, విద్యార్థులతో కలిసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రతి యువకుడు, విద్యార్థికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారి హక్కుల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.







