---Advertisement---

Jyothika: ఇక చాలు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే..జ్యోతిక స్ట్రాంగ్ వార్నింగ్!

July 25, 2026

Summarize with AI

---Advertisement---

నీట్ యూజీ(NEET-UG) పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్న వేళ కోలీవుడ్ నటి జ్యోతిక (Jyothika) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద విద్యార్థులు(Students) చేపట్టిన ఆందోళనలకు బహిరంగ మద్దతు ప్రకటించిన ఆమె.. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే తన పదవికి రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశం పంచుకున్న జ్యోతిక.. “జై హింద్”(Jai Hind) అంటూ విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ భవిష్యత్తు కోసం విద్యార్థుల(Students) పక్షాన నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆమె.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

20 రోజులకు పైగా నిరాహార దీక్ష (Hunger Strike) చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో (Sonam Wangchuk) పాటు ఉద్యమంలో పాల్గొంటున్న అభిజిత్ దిప్కే(Abhijit Dipke), సౌరవ్ దాస్‌లకు (Sourav Das) జ్యోతిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలు కూడా భవిష్యత్తులో అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటున్నానని భావోద్వేగంగా వెల్లడించారు. భయపడకుండా ఏకమై పోరాడుతున్న యువతను అభినందించిన ఆమె.. విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపిన కాక్రోచ్ జనతా పార్టీకి(CJP) కూడా ధన్యవాదాలు తెలిపారు.

నీట్ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. అలియా భట్, సల్మాన్ ఖాన్, హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, సోనాక్షి సిన్హా, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, స్వర భాస్కర్ తదితరులు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. జూలై 20న పార్లమెంట్ వైపు విద్యార్థులు చేపట్టిన మార్చ్ సందర్భంగా జరిగిన లాఠీచార్జ్(Lathi Charge), టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం (Central Government) వెల్లడించింది. విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను (Fast Track Courts) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించారు. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment