ముంబైకి (Mumbai) చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకప్పుడు ఆమెను బాధితురాలిగా చూపిస్తూ గత జగన్ ప్రభుత్వంపై (Jagan Government) తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం(Coalition Government), ఇప్పుడు సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో ఇబ్బందుల్లో పడి పరువు పోగొట్టుకుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
సీఐడీ దర్యాప్తులో (CID Investigation) భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, కుక్కల విద్యాసాగర్‌ను (Kukkala Vidyasagar) అత్యాచారం కేసు (Rape Case) పెడతానని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సాంకేతిక ఆధారాలు లభించినట్టు అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.32 కోట్లు జెత్వానీ మరియు ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించినట్టు. ఫోన్ కాల్స్(Phone Calls), ఎస్ఎంఎస్‌ల (SMS Messages) విశ్లేషణ ఆధారంగా ఈ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని కొర్టుకు నివేదించారు.
గతంలో కూడా జెత్వానీ పలువురు పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతోంది. పాస్‌పోర్ట్ (Passport) మరియు ఆధార్ కార్డుల్లో (Aadhaar Card) వేర్వేరు పుట్టిన తేదీలు ఉన్నాయన్న అంశం కూడా దర్యాప్తులో పరిశీలనకు వచ్చినట్టు సమాచారం.
జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. పి.ఎస్.ఆర్. ఆంజనేయులు(P.S.R. Anjaneyulu), కాంతిరాణా టాటా(Kanthirana Tata), విశాల్ గున్ని (Vishal Gunni) వంటి అధికారులను రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో బలిపశువులుగా చేశారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఒక బ్లాక్ మేయిలర్ ను ముందు పెట్టి మన అధికారులని బలి చేయడం కూటమి ప్రభుత్వం చెరుపుకోలేని తప్పిదంగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, విజయవాడ (Vijayawada) దుర్గగుడిలో (Durga Temple) ఆమెకు ప్రభుత్వం వీఐపీ దర్శనం కల్పించడం, పోలీసు రక్షణతో ప్రత్యేక ప్రోటోకాల్ ఇవ్వడం, హోం మంత్రి వంగలపూడి అనితను (Vangalapudi Anitha) కలిసి కేసులు ఉపసంహరించుకోవాలని కోరడం వంటి పరిణామాలు కూడా తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఇప్పుడు సీఐడీ ఆధారాలు కోర్టులో నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ఇప్పటివరకు జెత్వానీని బాధితురాలిగా చూపిస్తూ చేసిన రాజకీయ ప్రచారం ఎంతవరకు సమర్థనీయమన్నది. ఒక వివాదాస్పద కేసులో ప్రభుత్వం చూపిన అత్యుత్సాహం, సీనియర్ అధికారులపై తీసుకున్న చర్యలు, ఇప్పుడు ప్రజల ముందే తిరిగి ప్రశ్నలుగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం సీఐడీ జెత్వానీ కుటుంబ సభ్యులపై ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని చెబుతున్నప్పటికీ, ఆమె ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్నట్టు సాక్ష్యాలు లబించినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ కేసు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి మరింత పెద్ద దెబ్బగా మారుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.







