---Advertisement---

టీడీపీ ఇంటింటి ప్రచారంపై కాకాణి ఫైర్.. “ఏం సాధించారని ప్రజల ముందుకు వస్తున్నారు?”

July 30, 2026

Summarize with AI

---Advertisement---

టీడీపీ నేతలు(TDP Leaders), కార్యకర్తలు (Cadres) ఇంటింటికీ వెళ్లి (Door-to-Door Visit) ప్రజలను (People) కలవాలన్న పార్టీ నిర్ణయంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు చెప్పుకునే ఒక్క మంచి పని కూడా చేయలేదని, అలాంటప్పుడు ఏం సాధించామని ఇంటింటికీ తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ (TDP) నాయకులు ప్రజలకు తమ ముఖం కూడా చూపించలేదని ఎద్దేవా చేశారు.

తల్లికి వందనం(Talliki Vandanam Scheme), అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) వంటి పథకాల పేరుతో హామీలు ఇచ్చి, అమలులో మాత్రం కోతలే పెట్టారని కాకాణి ఆరోపించారు. అబద్ధాలకు కొత్త రూపం ఇస్తే అది సీఎం చంద్రబాబేనని(CM Chandrababu Naidu) విమర్శించారు. అలాగే విద్యాశాఖను మంత్రి లోకేశ్(Lokesh) పూర్తిగా భ్రష్టుపట్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డీఎస్సీ నియామకాలలో (DSC Recruitments) అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాకాణి, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలకు అన్యాయం జరిగిందంటూ డీఎస్సీ అభ్యర్థుల తల్లిదండ్రులు ఆధారాలతో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో (Stanford University) చదివానని చెప్పుకునే మంత్రి లోకేశ్‌పై కూడా కాకాణి సెటైర్లు వేశారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాల్సింది పోయి, జగన్‌కు సవాళ్లు విసరడం ఎందుకని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థపై లోకేశ్‌కు పూర్తి అవగాహన లేదని ఎద్దేవా చేస్తూ, చేతనైతే ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేకపోతే మౌనంగా ఉండాలని తీవ్రంగా మండిపడ్డారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment