---Advertisement---

కవిత కొత్త పార్టీపై బీజేపీ చీఫ్ సెటైర్లు.. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారంటూ వ్యాఖ్యలు

April 25, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొత్త చర్చకు దారితీసిన కవిత (Kavitha) కొత్త పార్టీపై బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని (Telangana Rashtra Sena Party) ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.

ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి భయం లేదన్న రామచందర్ రావు

రామచందర్ రావు మాట్లాడుతూ కేఏ పాల్ (KA Paul) కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఏ పార్టీ ప్రజల కోసం నిజంగా పనిచేస్తుందో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ (Narendra Modi) అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు.

గతంలో టీఆర్ఎస్(TRS), తరువాత బీఆర్ఎస్(BRS), ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్(TRS) పేరుతో పార్టీ వస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు ఉన్నా బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని, తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీపై కవిత ఘాటు విమర్శలు

ఇదిలా ఉండగా పార్టీ ఆవిర్భావ సభలో కవిత బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ నుంచి 7 మండలాలు వెళ్లిపోయినా బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. విభజన హామీలు అమలు చేయకపోయినా స్పందించడం లేదని ఆరోపించారు.

తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏపీలో (AP) కలిసిన కనీసం 5 గ్రామాలను తిరిగి తెప్పించాలని సవాల్ విసిరారు. భద్రాచలం సమీప గ్రామాలు పోతే రాముడి గుడి మునిగే పరిస్థితి వస్తుందని అన్నారు.

కేసీఆర్, బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు

కవిత తన ప్రసంగంలో కేసీఆర్(KCR), బీఆర్ఎస్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ప్రజల కోసం పోరాడిన కేసీఆర్ ఇప్పుడు మారిపోయారని అన్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.

ఆ పార్టీలో అమ్మతనం పోయిందని, మమకారం పోయిందని, అందుకే కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ కాదని వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసిన విధానంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment