---Advertisement---

కేసీఆర్ కీలక నిర్ణయం.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం..!

August 8, 2026

Summarize with AI

---Advertisement---

అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) కుటుంబానికి(Family) పార్టీ అధినేత కేసీఆర్(KCR) అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు.

పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా (Warangal District) ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల (Two Children) భవిష్యత్తు కోసం చెరో రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు కేటాయించారు.

అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ (Amruthamma) బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు పిల్లల చదువులు, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ పూర్తైన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై కుటుంబానికి అవసరమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలపై (Welfare Programs) నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ తెలిపారు. పెద్ది కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment