---Advertisement---

విజయవాడలో మళ్లీ కాల్ మనీ మాఫియా?.. సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ.

July 6, 2026

Summarize with AI

---Advertisement---

విజయవాడలో(Vijayawada) మళ్లీ కాల్ మనీ(Call Money) మాఫియా విజృంభిస్తోందంటూ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) (Kesineni Srinivas (Nani)) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) ఘాటైన లేఖ రాశారు. నగరంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం, అధికార పక్ష నేతల జోక్యం, వ్యవస్థీకృత నేరాల పెరుగుదలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో గతంలో అణచివేసిన కాల్ మనీ సిండికేట్లు మళ్లీ చురుకుగా మారాయని, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) మరియు ఆయన అనుచరుడు మూల్పూరి కిషోర్ (Mulpuri Kishore) అండతో ఈ మాఫియా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

లేఖలో గాయత్రి నగర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి(Chagarla Gayatri) ఘటనను ప్రధానంగా ప్రస్తావించారు. వ్యాపార అవసరాల కోసం రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్న ఆమె, అసలు-వడ్డీ కలిపి మొత్తం రూ.21 కోట్లు చెల్లించినప్పటికీ, బాపులపాడు మండలంలోని ఆమెకు చెందిన 11 ఎకరాల విలువైన భూమిని తిరిగి ఇవ్వకుండా ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అదనంగా మరో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ, 2026 మే 27న ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెను, ఆమె కుమార్తెలను శారీరకంగా హింసించి చంపేస్తామని బెదిరించారని, ఈ ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని వివరించారు.

విజయవాడ సిటీ టాస్క్ ఫోర్స్‌తో (Vijayawada City Task Force) పాటు కొన్ని స్థానిక పోలీస్ స్టేషన్లు ప్రజల రక్షణ బాధ్యతను విస్మరించి అధికార పక్ష నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కేశినేని నాని ఆరోపించారు. అమాయకులను అర్థరాత్రి వేళల్లో అక్రమంగా నిర్బంధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో హ్యాబిచువల్ అఫెండర్‌గా (Habitual Offender) పేర్కొన్న మూల్పూరి కిషోర్‌పై వెంటనే పీడీ యాక్ట్ ప్రయోగించాలని, ఇసుక, మద్యం, భూకబ్జాలు, జూదం వంటి అక్రమ సిండికేట్లపై స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ జరపాలని, నేరస్తులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు, సిటీ టాస్క్ ఫోర్స్ పనితీరుపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని, చాగర్ల గాయత్రి కుటుంబానికి తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

కూటమి ప్రభుత్వ హయాంలో అధికార అండతో పెరుగుతున్న మాఫియా వ్యవస్థను అరికట్టి, విజయవాడలో సామాన్య ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించాలని కోరుతూ కేశినేని నాని తన లేఖను ముగించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment