---Advertisement---

విజయవాడ ఎంపీ చిన్నీపై విచారణ చేయాలని ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ కేసినేని నాని.

June 12, 2026

Summarize with AI

---Advertisement---

విజయవాడ ఎంపీ (Vijayawada MP) కేసినేని శివనాథ్ (Kesineni Sivanath) (చిన్నీ)(Chinni) ఆయన అనుచరులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (Money Laundering Act) కింద సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎంపీ కేసినేని శ్రీనివాస్ (Kesineni Srinivas) (నాని)(Nani) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు(ED) సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో ఎంపీ చిన్నీపై పలు అవినీతి(Corruption), ఆర్థిక అక్రమాలు (Financial Irregularities) మరియు అధికార దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్థలు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

నాని చేసిన ఆరోపణల ప్రకారం, లిక్కర్ స్కామ్‌కు (Liquor Scam) సంబంధించిన వ్యవహారంలో ఎంపీ చిన్నీ కుటుంబ సభ్యుల పాత్రపై ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మరింత లోతైన విచారణ అవసరమని పేర్కొన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టికెట్ (Tiruvuru Assembly Ticket) కోసం రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసి తీసుకున్నారనే ఆరోపణలను కూడా తన లేఖలో ప్రస్తావించారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, బాచుపల్లి ప్రాంతాల్లో ‘కేసినేని డెవలపర్స్’(Kesineni Developers) మరియు వివాదాస్పద రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి ప్రీ-లాంచ్ ప్రాజెక్టుల పేరుతో వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసి భారీగా నిధులు సమీకరించారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోని 112 ఎకరాల వివాదాస్పద భూమి (Disputed Land) వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని, న్యాయ ప్రక్రియను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో (Andhra Cricket Association – ACA) నిధుల దుర్వినియోగం, విజయవాడ ఉత్సవ్ పేరుతో వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేయడం, విదేశాల్లో వీసాల పేరుతో మోసాలు, అలాగే ఇసుక, కంకర అక్రమ మైనింగ్, గ్యాంబ్లింగ్ కేంద్రాలు మరియు భూ కబ్జాలకు సంబంధించిన కార్యకలాపాల్లో కూడా ఎంపీ అనుచరుల ప్రమేయం ఉందని నాని తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ ఆరోపణలపై ఎంపీ చిన్నీ, ఆయనకు సంబంధించిన వ్యక్తులు మరియు సంస్థలపై సమగ్ర విచారణ చేపట్టి, అవసరమైతే అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను నాని కోరారు. రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న నెట్‌వర్క్‌ను వెలికితీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ లేఖ ప్రతులను ప్రధాని కార్యాలయం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరియు సీబీఐ డైరెక్టర్‌కు కూడా పంపినట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment