---Advertisement---

జై శ్రీరాం అంటే డబ్బులు పడతాయా?.. కొండా సురేఖ సంచలన కామెంట్స్

May 5, 2026

---Advertisement---

హనుమకొండలో(Hanumakonda) నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో(Mega Farmers Meet) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తెలంగాణ పర్యటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) నేతలు మీటింగ్‌లు పెట్టి జై శ్రీరాం నినాదాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జై శ్రీరాం (Jai Shri Ram అంటే ప్రజలకు డబ్బులు పడుతున్నాయా, ఏమైనా పథకాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మోడీని తీసుకువచ్చి ఒక మీటింగ్‌లో హిందీలో కొన్ని మాటలు మాట్లాడించి తిరిగి పంపించేస్తారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీ నేతలు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాల కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) కేంద్రం కోట్ల రూపాయలు విడుదల చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం రూ.4200 కోట్లు కేటాయించి, అందులో నుంచి రూ.1400 కోట్లు ఇప్పటికే విడుదల చేశారని చెప్పారు. భద్రాచలం, వేములవాడ, బాసర వంటి ప్రముఖ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

ఇక బీఆర్ఎస్‌పై(BRS) కూడా కొండా సురేఖ తీవ్ర విమర్శలు గుప్పించారు. కళ్లు ఉన్నా చూడని, చెవులు ఉన్నా వినని పార్టీగా బీఆర్ఎస్ మారిపోయిందని అన్నారు. రైతుల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే వారి పని అయిపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు ఏమి చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

రైతులకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చిన మూడు నల్లచట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించడం విచిత్రమని వ్యాఖ్యానించారు.

ప్రజలకు విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ పనితీరును చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment