కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. మహేశ్వరంలో కనిపిస్తున్న కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్(BRS) విజయం ఖాయమని, కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మరోసారి గెలుస్తారని, కాంగ్రెస్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పడం ఖాయమని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, సంక్షేమం (Welfare) స్థానంలో సంక్షోభం (Crisis) వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ కిట్ స్థానంలో కరెంటు కోతలు(Power Cuts), రైతుబంధు (Rythu Bandhu) స్థానంలో రాహుల్ బంధు (Rahul Bandhu) వచ్చాయని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులతో గురుకుల పాఠశాలలు (Gurukul Schools), విద్యుత్(Electricity), సాగునీటి ప్రాజెక్టులు(Irrigation Projects), సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలు చేశామని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల 6 నెలల్లో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క పెద్ద అభివృద్ధి పనిని కూడా ప్రారంభించలేదని విమర్శించారు. రైతులకు ఎరువులు, కొనుగోలు కేంద్రాల్లో సంచులు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఫ్యూచర్ సిటీ (Future City) పేరుతో రైతుల భూములను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన కేటీఆర్, ఫార్మా సిటీ (Pharma City) ప్రాజెక్టును కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం పక్కన పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలకు(Womens) నెలకు రూ.2500 చొప్పున హామీ ఇచ్చిన డబ్బును ఐదేళ్ల పాటు చెల్లిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.
చివరగా ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎస్.ఐ.ఆర్(SIR) కార్యక్రమంలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్‌లో బీఆర్ఎస్‌కు మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.







