---Advertisement---

“మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”… ప్రజల్లో ఉండేవారికే కార్పొరేట్ టికెట్లు: కేటీఆర్

May 24, 2026

---Advertisement---

హైదరాబాద్‌లో (Hyderabad) బీఆర్ఎస్ జెండా (BRS Flag) పట్టే వాళ్లే లేరని అనుకునే రోజుల నుంచి ఇప్పుడు భారీ సైన్యం తయారైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అంబర్‌పేట్‌లో కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పార్టీ (KCR Party) స్థాపించిన రోజుల్లో రాజకీయ నాయకులను ప్రజలు టైమ్‌పాస్ కోసం వాడుకునే వాళ్లుగా భావించేవారని, అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.

పార్లమెంట్‌లో (Parliament) తెలంగాణను (Telangana) అవమానించిన వారికి సమాధానం చెప్పడానికి ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోవడం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దిక్కుమాలిన కాంగ్రెస్‌ను (Congress) మూసీలో (Musi River) కలపాలని విమర్శించిన ఆయన.. రైతుల కన్నీళ్ల నుంచి నెత్తురు కారుతోందని ఆరోపించారు. జూన్ నెలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, జూలైలో కమిటీల ఏర్పాటు చేపడతామని వెల్లడించారు. జూన్ 15 తర్వాత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

కార్పొరేటర్ టికెట్ (Corporator Ticket) కావాలంటే ప్రజల్లో తిరిగే నాయకులకే అవకాశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల మధ్యలో ఉండే నాయకులే అసలు నాయకులని చెబుతూ “మీ గల్లీ కేసీఆర్(KCR) మీరే కావాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 శాతం కాలం పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.

శనివారం, ఆదివారం వస్తే హైడ్రా (HYDRA) పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఇప్పటికే ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదని, కానీ న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీ (Future City) నిర్మిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి మురిసిపోతున్నారని, కానీ రైతుల సమస్యలపై కేబినెట్‌లో కనీస చర్చ కూడా జరగలేదని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు (Smart Meters) పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కూడా మీటర్లు అమర్చాలని చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోడీ ఏం చెబితే దానికి రేవంత్ రెడ్డి తందాన అంటున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్ రద్దు చేయడానికే మోటార్ల వద్ద మీటర్లు పెడుతున్నారని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ముందుగానే కేంద్రానికి దీనిపై వ్యతిరేకంగా చెప్పారని గుర్తు చేశారు.

డిసెంబర్‌లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నానని, మరో సంవత్సరం ఓపిక పట్టుకుంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భూముల ధరలు మళ్లీ పెరుగుతాయని, గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment