---Advertisement---

డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమన్న కేటీఆర్.. అయినా ఎందుకు జరగలేదు? ప్రభుత్వంపై ఘాటు విమర్శలు

March 18, 2026

Summarize with AI

---Advertisement---

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై (Moinabad Drugs Case) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) చేసిన తప్పుపై పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. తాను డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమని ప్రకటించినప్పటికీ అది ఎందుకు అమలు కాలేదో ప్రశ్నించారు.

రాజీనామా సవాల్.. ప్రభుత్వంపై విమర్శలు

హైదరాబాద్‌లో (Hyderabad) మీడియాతో మాట్లాడిన కేటీఆర్ వడ్డీలేని రుణాల అంశంపై (Interest-Free Loans) కూడా స్పందించారు. ప్రభుత్వం ఇచ్చినట్లు చెబుతున్న రుణాలకు ఆధారాలు చూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. సభను తప్పుదోవ పట్టించిన వారు రాజీనామా చేయాలా లేక తానే చేయాలా అని ప్రశ్నించారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) విషయంలో తమకు ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు. కేసీఆర్(KCR) ఎప్పుడు ఎక్కడికి రావాలో ఆయనకే తెలుసని వ్యాఖ్యానించారు. పార్టీ మారి ఇతర పార్టీల తరఫున పోటీ చేసిన వారిపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కూడా విమర్శించారు.

మూసీ ప్రాజెక్టు (Musi Project), హ్యామ్ రోడ్లపై (HAM Roads) అవినీతి (Corruption) ఆరోపణలపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపడతామని తెలిపారు. నిషేధిత భూముల అంశంపై మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు విషయంలో మంత్రుల కంటే అధికారులు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రణాళిక, నిధులు లేకుండానే ఇండ్లు కూల్చివేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment