---Advertisement---

నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా..రక్త పిశాచీ.! రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం!

July 12, 2026

Summarize with AI

---Advertisement---

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులకు(Farmers) సాగునీరు (Irrigation Water) అందించకుండా, నీళ్లు అడిగిన ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి అవలంబిస్తోందంటూ బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా.. రక్త పిశాచీ..! ఇంకా తీరలేదా మీ రక్తదాహం?” అంటూ కాంగ్రెస్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత 60 ఏళ్లుగా తెలంగాణ (Telangana) ప్రజలను కాంగ్రెస్ తీవ్రంగా నష్టపరిచిందని కేటీఆర్(KTR) ఆరోపించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చరిత్ర నిండిపోయిందని విమర్శించారు. 1952లో 7 మంది యువకులు, 1969 ఉద్యమంలో 369 మంది అమరులైన ఘటనలను గుర్తు చేస్తూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పాత్రను ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వేలాది మంది బలిదానాలకు కాంగ్రెస్ విధానాలే కారణమని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిసిపోయాయని, ఆ చరిత్రను ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం, సాగునీటి కోసం బీఆర్‌ఎస్(BRS) చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

“నెత్తురు (Blood) ఇస్తేనే నీళ్లు ఇస్తాం అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకొస్తే, రైతుల కోసం మా రక్తాన్ని కూడా ధారపోస్తాం. కానీ ఎండిపోతున్న పంట పొలాలకు వెంటనే సాగునీరు అందించాలి” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. రైతుల పక్షాన చివరివరకు నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment