బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) రాజకీయ వేదికలపై తన చురుకైన ప్రసంగాలతో కనిపిస్తుంటారు. అయితే ఈసారి పూర్తిగా భిన్నమైన కోణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘ది అండర్ 18 వరల్డ్’(The Under 18 World) అనే చిన్నారుల కార్యక్రమంలో (Children’s Program) పాల్గొన్న ఆయనకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా చిన్నారులతో కలిసి సరదాగా గడిపిన కేటీఆర్ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఈ కార్యక్రమంలో చిన్నారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఎంతో హాస్యంగా సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు మాత్రం ఆయనను కాసేపు ఆలోచింపజేయగా, నవ్వుతూ తల పట్టుకున్న తీరు ప్రేక్షకులను అలరించింది. పిల్లలతో కలిసి సరదాగా మాట్లాడుతూ, వారి ప్రశ్నలకు చమత్కారంగా స్పందించిన కేటీఆర్ కొత్త కోణం ఈ ప్రోమోలో స్పష్టంగా కనిపించింది.
అయితే కార్యక్రమంలో అసలైన హైలైట్ మాత్రం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు (Prabhas) కేటీఆర్ లైవ్‌లో (Live) ఫోన్(Phone Call) చేయడమే. చిట్‌చాట్ మధ్యలోనే ప్రభాస్‌కు కాల్ చేసి మాట్లాడటంతో అక్కడ ఉన్న చిన్నారులు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. స్క్రీన్‌పై ప్రభాస్‌తో కేటీఆర్ సంభాషణను చూసిన అభిమానులు కూడా ఈ సర్‌ప్రైజ్‌ను ఆస్వాదిస్తూ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కార్యక్రమంలో పాల్గొన్న ఓ చిన్నారి విసిరిన ఛాలెంజ్‌ను కూడా కేటీఆర్ ఎంతో ఉత్సాహంగా స్వీకరించారు. స్టేజ్‌పైనే ఆమెతో కలిసి పుష్‌అప్స్ చేసి తన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఫిట్‌నెస్ విషయంలోనూ తాను ఎంత యాక్టివ్‌గా ఉంటానో ఈ సందర్భంగా చూపించారు.
PRA Boss × Vanga’s Spirit drops March 27.
— theunder18world (@TheUnder18World) June 30, 2026
KTR Boss × TheUnder18World Round Table drops July 26.
Mr. KTR might be ur fav politician, ur wholesome Ram Anna, or ur tech-savvy minister. But for us, he’s our bruh — we just vibe and chill with him. This convo shows you how. @KTRBRS pic.twitter.com/uH3U5JvUEI
కార్యక్రమం ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేటీఆర్ సతీమణి శైలిమ (Shailima) నుంచి ఫోన్ రావడంతో ఆయన కాసేపు ఇబ్బందిగా నవ్వుతూ, “షోలో ఉన్నాను… తర్వాత మాట్లాడుతాను” అంటూ వెంటనే కాల్ ముగించారు. ఈ సన్నివేశం ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సోషల్ మీడియాలో నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
రాజకీయ నాయకుడిగా గంభీరంగా కనిపించే కేటీఆర్‌లోని సరదా, వినోదభరితమైన వ్యక్తిత్వాన్ని ఈ కార్యక్రమం మరోసారి బయటపెట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నారులతో కలిసి నవ్వులు పంచుకున్న ఈ పూర్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో త్వరలో విడుదల కానుండటంతో రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.







