బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్లో (Telangana Bhavan) నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను (Job Promises) అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో యువత తీవ్ర నిరాశ, ఆందోళనలో ఉందని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ యువత భవిష్యత్తుపై (Telangana Youth Future) తీవ్ర అనిశ్చితిలో ఉందన్నారు. ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు భారీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP) పార్టీలకు అలవాటుగా మారిందని విమర్శించారు. 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను (Job Calendar) గుర్తు చేస్తూ, ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. ప్రచార సభల్లో ఇచ్చిన మాటలకు విలువ లేకపోయినా, కనీసం శాసనసభలో ఇచ్చిన హామీలను అయినా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మంలో వేణు (Venu) అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనను ప్రస్తావించిన కేటీఆర్, అతడు రాసిన సూసైడ్ నోట్లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వరకు చేరేలా షేర్ చేయాలని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ లేఖలో తమ పేరును కూడా ప్రస్తావించినప్పటికీ, అది సాధారణ సూసైడ్ నోట్ (Suicide Note) కాదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాసిన చార్జ్షీట్లా ఉందని వ్యాఖ్యానించారు.
అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను గుర్తు చేస్తూ, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇప్పుడు తెలంగాణకు ఎందుకు రావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు దూరంగా ఉంటూ, తమ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మాత్రం రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.






