---Advertisement---

ఢిల్లీలో ఎస్‌ఐఆర్ కలకలం.. ఎల్‌కే అద్వానీ సహా ప్రముఖులకు నోటీసులు!

September 20, 2026

Summarize with AI

---Advertisement---

ఎల్‌కే అద్వానీతో(LK Advani) పాటు కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్(S. Jaishankar), మాజీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ(Upendra Dwivedi), సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్(Praveen Sood), ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) సహా పలువురు ప్రముఖులకు ఎస్‌ఐఆర్(SIR)నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో సుమారు 33.13 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల్లో (Enumeration Forms) నమోదైన వివరాల్లో వ్యత్యాసాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేసి వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు 31.63 లక్షలకు పైగా నోటీసులు అందజేసినట్లు ఢిల్లీ ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఎల్‌కే అద్వానీ, ఆయన కుమార్తె ప్రతిభ(Pratibha), కోడలు గీతిక (Geetika) పేర్లు 2002లోని గత ఎస్‌ఐఆర్ ఓటరు జాబితాలోని వివరాలతో సరిపోలకపోవడంతో వారికి కూడా నోటీసులు జారీ చేశారు. అద్వానీ కుటుంబానికి చెందిన నలుగురు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో(New Delhi Assembly Constituency) ఓటర్లుగా నమోదై ఉన్నారు.

అయితే ఎస్‌ఐఆర్ నోటీసులు జారీ కావడం వల్ల ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించినట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంబంధిత ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించి తమ వివరాలను ధ్రువీకరించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment