వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Y.S. Jagan Mohan Reddy) రాష్ట్ర రాజధానిపై తమ విధానం “మావిగన్”(MAVIGUN) అని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh)రాజధాని అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్రబిందువైంది. రాష్ట్ర విభజన (Staet Bifurcation) జరిగి దశాబ్దానికి పైగా గడిచినా, అమరావతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమ ఉమ్మడి రాజధానిగా పూర్తిగా అంగీకరించలేదనే అభిప్రాయాలు మరోసారి వినిపిస్తున్నాయి.
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమరావతి ప్రాజెక్ట్‌ను(Amaravati Project) రాష్ట్ర ప్రజలందరి రాజధానిగా కాకుండా, 29 గ్రామాల రైతులు (Farmers) మరియు అప్పటి ప్రభుత్వం(Government) మధ్య జరిగిన భూ సమీకరణ (Land Pooling) ఒప్పందానికి పరిమితమైన ప్రాజెక్ట్‌గా చూసే వారి సంఖ్య పెరుగుతోందని చర్చ సాగుతోంది. రాజధాని(Capital) అంశంపై అక్కడి కొందరు వర్గాలు ప్రదర్శిస్తున్న వైఖరి కూడా ఈ భావనకు బలం చేకూరుస్తోందని వారు పేర్కొంటున్నారు.
ఇటీవల ఏబీఎన్‌కు చెందిన వెంకట కృష్ణ (Venkata Krishna) చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి. “అమరావతి (Amaravati) వైపు చూడాలంటే భయపడేలా చేయాలి” అనే వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించే రాజధానిలో భిన్నాభిప్రాయాలకు స్థానం లేకపోతే, అది నిజంగా ప్రజల రాజధానిగా ఎలా పరిగణించబడుతుందనే ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో “మావిగన్”(MAVIGUN) భావనకు కేవలం ఉత్తరాంధ్ర, రాయలసీమ మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ ఆదరణ లభించే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి వాదన ప్రకారం, అమరావతి పరిమిత భౌగోళిక పరిధితో ఉండగా, మావిగన్(MAVIGUN) నమూనాలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వంటి ప్రధాన నగరాలు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతాయి. తద్వారా ఆ ప్రాంత ప్రజలు కూడా అధికారికంగా రాజధాని (Capital) ప్రాంత వాసులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
అంతేకాకుండా, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో న్యూఢిల్లీ, ఘజియాబాద్, ఫరీదాబాద్ వంటి నగరాలకు అనుసంధానంగా నోయిడా ఎలా వేగంగా అభివృద్ధి చెంది ప్రధాన పట్టణ కేంద్రంగా మారిందో, అదే తరహాలో విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం (Vijayawada-Guntur-Machilipatnam) ప్రాంతాలను అనుసంధానిస్తూ మావిగన్ రాజధాని నమూనా కూడా సమగ్ర ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రాజధాని అంశం రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక అజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.






