---Advertisement---

MBU కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలు… మంచు కుటుంబానికి లీగల్ నోటీసుల హెచ్చరిక!

February 4, 2026

Summarize with AI

---Advertisement---

Mohan Babu University (MBU)లో ఫీజుల వసూళ్ల (Fee Collection)పై నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తిరుపతి (Tirupati)లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయని తిరుపతి పోలీసులు వెల్లడించారు. యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరచారి (Ravimanoharachary) వివరాల ప్రకారం, విద్యార్థి సంఘం నేతలు వినోద్ (Vinod), అక్బర్‌ (Akbar) లను కిడ్నాప్ చేసిన ఘటనపై ఫిర్యాదు అందగానే ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. శేషాపురం ప్రాంతంలో ఈ ఘటనకు పాల్పడిన 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి ఉపయోగించిన మూడు ఇనోవా వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అవి (Mohan Babu University)కి చెందినవేనని నిర్ధారించారు.

అరెస్ట్ అయిన వారిలో యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌తో పాటు బౌన్సర్లు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బౌన్సర్లను స్వీయ రక్షణకే పరిమితం చేయాలని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కేసులో A2, A3లుగా మోహన్ బాబు, విష్ణుల పేర్లు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment