---Advertisement---

ముద్రగడ గారి చివరి కోరికను గౌరవించాం? కుమారులు బాలు, గిరిబాబు బహిరంగ లేఖ విడుదల.

July 17, 2026

Summarize with AI

---Advertisement---

కాపు ఉద్యమ నేత (Kapu Movement Leader) ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన కుమారులు బాలు(Balu), గిరిబాబు (Giribabu) మీడియాకు బహిరంగ లేఖ (Open Letter) విడుదల చేశారు. ముద్రగడ వ్యక్తిత్వం(Personality), ఆత్మాభిమానాన్ని (Self-respect) ప్రతిబింబించేలా ఆయన చివరి కోరికలను గౌరవించి అంత్యక్రియలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు.

లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు చూస్తే, ముద్రగడ వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. తన మరణానంతరం ఏం చేయాలనే విషయంపై ఆయన ముందుగానే తమకు స్పష్టమైన సూచనలు ఇచ్చారని తెలిపారు. ఆయన నిర్ణయం మేరకే అంత్యక్రియల (Last Rites) ప్రక్రియ నిర్వహించామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ స్పష్టంగా చెప్పారని, అదే కారణంతో ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించినట్లు వివరించారు. ఈ విషాద సమయంలో తమకు అండగా నిలిచి, ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తమ కుటుంబానికి(Family), బార్లపూడి క్రాంతి (Barlapudi Kranti Family) కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఎలాంటి సంబంధాలు, రాకపోకలు లేవని స్పష్టం చేశారు. బార్లపూడి క్రాంతి కడచూపుకు రాకూడదన్న నిర్ణయం కూడా ముద్రగడదేనని పేర్కొన్నారు. ఈ అంశాలపై అసత్య ప్రచారాలు, కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు ప్రసారం చేయవద్దని మీడియాను విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ ద్వారా ముద్రగడ చివరి కోరికలను గౌరవిస్తూ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment