భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) కోసం సుమారు 15 వేల ఎకరాల (15,000 Acres Lands) భూములను సేకరించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ప్రతిపాదించిన సమయంలో అనేక గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక విమానాశ్రయానికి అంత విస్తీర్ణంలో భూమి ఎందుకు అవసరమని స్థానిక రైతులు(Farmers), గ్రామస్తులు తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో 2015 అక్టోబర్‌లో స్థానిక ప్రజల సమస్యలను వినేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) నిర్వహించిన సభలో రెడ్డికంచేరు గ్రామానికి చెందిన నర్సాయమ్మ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఉన్న రెండు ఎకరాల భూమే జీవనాధారమని, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన తమ కుటుంబం భూములు కోల్పోతే ఎలా బతకాలని ప్రశ్నించారు.
అదే సమయంలో ఆమె అడిగిన “ఎర్రబస్సే (Red Bus) లేని ఊరులో ఎయిర్‌బస్సు(Airbus) ఎందుకు సార్?” అనే ప్రశ్న సభలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ వ్యాఖ్యను వైఎస్ జగన్(Ys Jagan) కూడా తన ప్రసంగంలో పునరావృతం చేశారు. అలాగే, రెడ్డికంచేరు గ్రామానికి ఆనుకుని ఉన్న సన్‌రే రిసార్ట్స్‌ను వదిలి, పేదల ఇళ్లు, రైతుల భూములను మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ఆమె నిలదీశారు. వైఎస్సార్ హయాంలో పొందిన ఇందిరమ్మ ఇళ్లను కూడా కోల్పోతే తమ కుటుంబాల పరిస్థితి ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల నిరసనలు, ప్రజా, ప్రతిపక్ష ఉద్యమాల నేపథ్యంలో ప్రతిపాదిత భూసేకరణపై విస్తృత చర్చ జరిగింది. అనంతరం భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ విస్తీర్ణం గణనీయంగా తగ్గించబడింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెడ్డికంచేరు గ్రామం (Reddikancheru Village) పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి తప్పిందని ఆ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.
నర్సాయమ్మ అడిగిన ప్రశ్న ఒక వ్యక్తి ఆవేదన మాత్రమే కాదు, తన గ్రామం, తన భూమి, తన జీవనాధికారాన్ని కాపాడుకోవాలన్న స్థానికుల భావోద్వేగానికి ప్రతీకగా నిలిచింది. నేడు భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో తన గ్రామం చెక్కు చేదరకుండా నిలబడింది అంటే అది ఆమే చూపిన పోరాట పటిమే కారణం. అందుకే రెడ్డికంచేరు గ్రామ చరిత్రలో నర్సాయమ్మ పేరు గ్రామాన్ని కాపాడేందుకు పోరాడిన మహిళగా చిరస్థాయిగా గుర్తుండిపోతుందని స్థానికులు భావిస్తున్నారు.







