సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతారకు (Nayanthara) భారీగా అభిమానులు ఉన్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన స్టైల్, ఫ్యాషన్‌కు సంబంధించిన ఫొటోలను (Photos) షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె మాల్దీవుల వెకేషన్‌కు (Maldives Vacation) సంబంధించిన బీచ్ ఫొటోలు (Beach Photos) వైరల్‌గా మారాయి.
సముద్ర తీరంలో దిగిన ఈ ఫొటోల్లో వైట్ క్రాప్డ్ టాప్, షీర్ ర్యాప్ స్కర్ట్‌తో కూడిన టూ-పీస్ తరహా దుస్తుల్లో నయనతార స్టైలిష్‌గా కనిపించారు. సముద్రం, ఆకాశం నేపథ్యంగా ఉన్న ఈ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘Orange Flavored Cigarettes’ పాటను జోడించారు.
అయితే నయనతార షేర్ చేసిన ఫొటోలు బ్లర్‌గా (Blur) ఉండటంతో అభిమానులు నిరాశ చెందారు. దీంతో కొందరు నెటిజన్లు ఏఐ సాయంతో బ్లర్‌ను (Blur) తొలగించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 41 ఏళ్ల వయసులోనూ ఆమె మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్, లుక్‌పై ఫ్యాన్స్(Fans) ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, 2007లో వచ్చిన ‘బిల్లా’ సినిమాలో నయనతార బికినీలో కనిపించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నయనతార ‘ముక్కుత్తి అమ్మన్ 2’(Mookuthi Amman 2), ‘డియర్ స్టూడెంట్స్’(Dear Students), ‘రక్కయి’(Rakkayie), ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’ (Mannan Gatti Since 1960) వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్లో తెరకెక్కుతున్న #SVC63 సినిమాలోనూ నటిస్తున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్నారు.







