టాలీవుడ్లో ఒకప్పుడు క్యూట్ కపుల్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్(Varun Sandesh), శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) జంట దాదాపు 18 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటిస్తోంది. ‘కొత్త బంగారు లోకం’(Kotha Bangaru Lokam) సినిమాతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హిట్ కాంబినేషన్.. ఇప్పుడు ‘నా వైఫ్ మిస్సింగ్’(Naa Wife Missing) అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ (Aha Streaming) కానున్న ఈ సిరీస్ ఇప్పటికే టీజర్‌తో(Teaser) ఆసక్తిని పెంచుతోంది. ‘అనుమానం.. అవమానం.. అవకాశం..’ అనే క్యాప్షన్‌తో విడుదలైన టీజర్లో వరుస ట్విస్టులు కనిపించడంతో సిరీస్‌పై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
‘నా వైఫ్ మిస్సింగ్’లో వరుణ్ సందేశ్ సాధారణ బ్యాంక్ ఉద్యోగి బాలు పాత్రలో కనిపించనున్నారు. శ్వేతా బసు ప్రసాద్ ఆయన భార్యగా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ బాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం టీజర్లో ప్రధానంగా చూపించారు.
అయితే ఆమె నిజంగానే కనిపించకుండా పోయిందా? ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేక ఆమె అదృశ్యం వెనుక బాలు హస్తం ఉందా? అనే ప్రశ్నలు టీజర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భార్య మిస్సింగ్ కేసు చుట్టూ అనుమానాలు, మలుపులు ఎలా సాగుతాయనేది సిరీస్‌లో చూడాల్సి ఉంది.
సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ‘నా వైఫ్ మిస్సింగ్’ సిరీస్ అక్టోబర్ 22 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట మరోసారి కలిసి కనిపించనుండటంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. అసలు భార్య అదృశ్యం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే అక్టోబర్ 22 వరకు వేచి చూడాల్సిందే.







