---Advertisement---

అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న సిద్ధార్థ్–కియారా!

October 7, 2026

Summarize with AI

---Advertisement---

బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra), కియారా అడ్వాణీ(Kiara Advani) తమ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఓ పాపకు తల్లిదండ్రులైన ఈ జంట.. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు ప్రకటించారు. తమ జీవితంలోకి మరో చిన్నారి (Baby) రాబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

“మా మనసులు ఆనందంతో, ప్రేమతో నిండిపోయాయి” అంటూ సిద్ధార్థ్, కియారా సామాజిక మాధ్యమాల (Social Media) వేదికగా ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గతేడాది జులై 16న సిద్ధార్థ్, కియారా దంపతులకు పండంటి ఆడబిడ్డ (Baby Girl) జన్మించింది. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. తమ వ్యక్తిగత జీవితంలోని ఈ సంతోషకరమైన విషయాన్ని స్వయంగా అభిమానులతో పంచుకోవడం విశేషంగా మారింది.

సిద్ధార్థ్, కియారా కలిసి 2021లో వచ్చిన ‘షేర్షా’Shershaah) సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. తమ ప్రేమకథ ఎలా మొదలైందో కియారా ‘కాఫీ విత్ కరణ్’(Koffee With Karan) సీజన్ 8లో సరదాగా వెల్లడించింది.

2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో సిద్ధార్థ్, కియారా ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అన్యోన్యంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు మరో చిన్నారికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. దీంతో సిద్ధార్థ్, కియారా అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment