---Advertisement---

భువనేశ్వర్‌లో ప్రభుత్వ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు స్వాధీనం

February 25, 2026

Summarize with AI

---Advertisement---

లంచం కేసులో మైనింగ్ శాఖకు (Mining Department) చెందిన సీనియర్ అధికారిని ఒడిశా విజిలెన్స్ విభాగం (Odisha Vigilance Department) రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. ఆ అధికారి ఫ్లాట్ నుంచి రూ.4 కోట్ల (Rs. 4 Crores) విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనం అని ఆ శాఖ పేర్కొంది. నివేదికల ప్రకారం, ఒడిశా విజిలెన్స్ గతంలో కటక్ సర్కిల్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతిని (Debabrata Mohanty) రూ.30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. బొగ్గు రవాణా అనుమతి కొరకు లైసెన్స్ పొందిన బొగ్గు వ్యాపారి నుండి డబ్బు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

మంగళవారం, విజిలెన్స్ బృందం పక్కా ప్లాన్ తో మొహంతిని రూ.30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. అరెస్టు చేసిన వెంటనే, విజిలెన్స్ అధికారులు మూడు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.. భువనేశ్వర్‌లోని (Bhubaneswar) అతని ఫ్లాట్, భద్రక్ జిల్లా మథసాహిలోని అతని పూర్వీకుల ఇల్లు, కటక్‌లోని అతని కార్యాలయం. ఈ దాడిలో, భువనేశ్వర్‌లోని పాటియాలోని శ్రీవిహార్ ప్రాంతంలోని నేచర్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లోని అతని ఫ్లాట్ (నంబర్ 302) నుండి అధికారులు రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

భువనేశ్వర్‌లోని పహ్లా ప్రాంతంలో సుమారు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన రెండంతస్తుల ఇల్లు, సుమారు 130 గ్రాముల బంగారంతో సహా అదనపు ఆస్తులను ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment