---Advertisement---

హనుమకొండలో పవన్ కళ్యాణ్ కలిసిన చిన్నారి నిరంజన్ కన్నుమూత

July 8, 2026

Summarize with AI

---Advertisement---

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (Ponuganti Niranjan) (17) కన్నుమూశారు. అరుదైన జన్యుసంబంధిత (Genetic) వ్యాధి మస్కులర్ డిస్ట్రోఫీతో (Muscular Dystrophy) కొంతకాలంగా పోరాడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా హైదరాబాద్‌కు (Hyderabad) తరలించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. నిరంజన్ మృతితో హనుమకొండ హనుమాన్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

కేవలం 3 ఏళ్ల వయసు నుంచే నిరంజన్ ఈ అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. వ్యాధి ప్రభావం కారణంగా 17 ఏళ్లు వచ్చినా కూడా ఆయన శారీరక ఎదుగుదల 4 ఏళ్ల చిన్నారి స్థాయిలోనే నిలిచిపోయింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్‌పై ఆయనకు ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. పవన్ పాటలకు డ్యాన్స్ చేస్తూ, ఆయన స్టైల్‌ను అనుకరిస్తూ స్థానికంగా ‘ఛోటా గబ్బర్ సింగ్’గా (Chota Gabbar Singh) గుర్తింపు పొందారు.

పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలన్నదే నిరంజన్ చివరి కోరిక. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిన పవన్ కళ్యాణ్ గత జూన్ 17న స్వయంగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చొని ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే కుటుంబానికి రూ.1 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధి కోసం క్యాంటీన్ (Canteen) ఏర్పాటు చేస్తామని, భద్రకాళి అమ్మవారి (Bhadrakali Goddess) వెండి విగ్రహాన్ని (Silver Idol) బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు.

తన అభిమాన హీరోను ప్రత్యక్షంగా కలుసుకున్న ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని రోజులకే నిరంజన్ మరణించడం కుటుంబ సభ్యులతో పాటు పవన్ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ వార్త తెలిసిన వెంటనే జనసేన (Jana Sena) నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నిరంజన్ మరణ వార్త తెలుసుకున్న నటుడు సోనూ సూద్(Sonu Sood) కూడా ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించిన ఆయన, త్వరలోనే వరంగల్‌కు వచ్చి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శిస్తానని ఫోన్‌లో హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment