---Advertisement---

మోదీపై కన్నీళ్లు.. విద్యార్థులపై మౌనం? పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పెరుగుతున్న విమర్శలు

August 1, 2026

Summarize with AI

---Advertisement---

ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) విమర్శిస్తుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. భోగాపురంలో (Bhogapuram) జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కొందరు ప్రధాని మోదీని అనుచితంగా విమర్శించడం తనకు ఎంతో బాధ (Pain) కలిగించిందని పవన్ పేర్కొన్నారు. ప్రధానిగా ఆ స్థాయికి చేరుకోవడానికి నరేంద్ర మోదీ ఎంతో కష్టపడ్డారని, నేటి తరానికి ఆ ప్రయాణం తెలియక విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

అయితే పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో యువత (Youth) పూర్తిగా ఏకీభవించే పరిస్థితి కనిపించడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన పరిపాలనా వైఫల్యాలపై విద్యార్థులు నిరసనలు (Students Protests) వ్యక్తం చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారి ఆందోళనలను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిందని వారు అంటున్నారు.

విద్యార్థుల ఆందోళనలు ఉధృతమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పోలీసు బలగాలను వినియోగించిందని, లాఠీచార్జీలు(Lathi Charges), బలప్రయోగం (Use of Force) వంటి చర్యలు తీసుకుందని విమర్శలు వచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో విద్యార్థుల పట్ల పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.

ఒకప్పుడు “ప్రశ్నించడానికే (Question) పార్టీ పెట్టాను” అని చెప్పిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతను విచ్చిన్న శక్తులుగా చిత్రీకరిస్తూ మాట్లాడటం సరైన విధానం కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి సహా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల విమర్శలను స్వీకరించాల్సిందేనని, సమస్యలను ప్రజల కోణంలో చూసి స్పందించకపోతే రకరకాల తీరులో విమర్శలు రావడం సహజమని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా ప్రధాని మోదీ పట్ల మాత్రమే సానుభూతి వ్యక్తం చేయడం యువతలో ప్రతికూల స్పందనకు దారితీస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువతకు దూరమవుతున్నారనే అభిప్రాయం బలపడితే అది రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, జనసేన పార్టీలో కూడా ఈ అంశంపై అంతర్గతంగా చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment