ఏపీ (Andhra Pradesh రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చంద్రబాబు ప్రభుత్వంపై (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించిన ఆయన.. పోలీసులను కూటమి ప్రభుత్వం (Coalition Government) అడ్డగోలుగా వాడుకుంటోందని మండిపడ్డారు. కానిస్టేబుళ్లకు అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించడం లేదని ప్రశ్నించారు.
సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. పోలీసు శాఖలో (Police Department) తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో మోసం చేసినట్టే కానిస్టేబుళ్లను కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరెండర్ లీవ్‌ను (Surrender Leave) 1/2కు తగ్గించారని, ఇవ్వాల్సిన 6 సరెండర్ లీవ్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు.
లా అండ్ ఆర్డర్ (Law and Order) డ్యూటీలు చేస్తున్న ప్రతి పోలీస్‌కు రూ.70 వేలకుపైగా బకాయిలు ఉన్నాయని పేర్ని నాని పేర్కొన్నారు. టీఏలు(TA Bills) కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. ఒకవైపు మందు తాగమని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో పోలీసులపై ఒత్తిడి పెడుతోందని విమర్శించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు (Drunk and Drive Cases) నమోదు చేయాలనే టార్గెట్ పెట్టారని ఆయన అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెబితేనే పోలీసులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాడులు చేశారని ఆరోపించారు.
పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అనే అవకాశం దేవుడెరుగు అని, వడగాల్పుల్లో సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడం లేదో చంద్రబాబు (Chandrababu Naidu) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్పీలో (APSP) 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారిని ఏఆర్‌కు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఏపీఎస్పీలోనే వెట్టి చాకిరి చేస్తూ రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని పేర్ని నాని మండిపడ్డారు. “పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు.. ఉప్మా మంత్రి(Upma Minister)” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానిస్టేబుల్ కుమారుడినని చెప్పుకునే పవన్.. పోలీసులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఓట్లు అడిగేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడినని చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
హోం మంత్రి (Home Minister) అనితపై (Anita) కూడా పేర్ని నాని విమర్శలు గుప్పించారు. హోం శాఖ గురించి తప్ప మిగతా అన్నింటిపైనా మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి అనితను కేవలం వైఎస్ జగన్‌ను (YS Jagan Mohan Reddy) తిట్టించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు.






