---Advertisement---

పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉపాధి హామీ శ్రామికులపై వివక్ష.

May 22, 2026

---Advertisement---

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో ఉపాధి హామీ (Employment Guarantee) పనుల కేటాయింపులో తీవ్ర వివక్ష చోటుచేసుకుందన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలకు అతీతంగా అమలు కావాల్సిన ఉపాధి హామీ పనుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, వైసీపీ(YSRCP) సానుభూతిపరులమనే కారణంతో కొంతమంది ఉపాధి శ్రామికులకు పని ఇవ్వలేమని ఫీల్డ్ అసిస్టెంట్ వీరబాబు (Veerababu) చెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక జనసేన (Jana Sena Party) నేతల ఒత్తిళ్ల కారణంగానే పని కల్పించలేకపోతున్నానని ఆయన వెల్లడించినట్లు శ్రామికులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన ఉపాధి శ్రామికులు పని ప్రదేశం వద్దే నిరసనకు దిగారు.

ఈ ఘటనతో ప్రభుత్వ వ్యవస్థలో రాజకీయ పక్షపాతం పెరుగుతోందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేదల పొట్టకూటిపై రాజకీయాలు చేయడం దారుణమని శ్రామికులు మండిపడుతుండగా, సామాజిక కార్యకర్తలు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన అందిస్తామని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పాలనలోనే ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “కూలీలు” (Coolies) అనే పదానికి బదులుగా గౌరవప్రదంగా “ఉపాధి శ్రామికులు” (Employment Workers) అని పిలవాలని వేదికలపై సూచనలు చేసిన పవన్ కళ్యాణ్, తమ స్వంత నియోజకవర్గంలోనే ఉపాధి అవకాశాల విషయంలో రాజకీయ వివక్ష ఆరోపణలు ఎదుర్కోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment