---Advertisement---

పొత్తుతో వస్తున్నారా..? సింగిల్‌గా వస్తున్నారా..? పవన్‌ కల్యాణ్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

June 4, 2026

Summarize with AI

---Advertisement---

జనసేన (Jana Sena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ రాజకీయాల్లోకి (Telangana Politics) వస్తానని, స్వయంగా ప్రజల్లో తిరుగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే పవన్ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసినట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. “మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేక సింగిల్‌గా వస్తున్నారా..? అనేది చెప్పి రండి” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ (Tweet) చేశారు. చివర్లో “జస్ట్ ఆస్కింగ్” అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జత చేశారు.

అయితే ఆ ట్వీట్‌లో ఎక్కడా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకపోయినా, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ట్వీట్ ఆయన గురించేనని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

కొంతమంది నెటిజన్లు పవన్ కల్యాణ్ వస్తే టీడీపీ(TDP), బీజేపీ(BJP) పొత్తుతోనే వస్తారని కామెంట్ చేస్తుండగా, మరికొందరు “ఎలా వస్తే నీకెందుకు” అంటూ ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పవన్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

“ముందు బెంగళూరులో డిపాజిట్ దక్కించుకో”, “మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వే ఇప్పుడు సలహాలు ఇస్తున్నావా” అంటూ పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment