---Advertisement---

వరుసగా కేబినెట్‌కు పవన్ డుమ్మా.. భవిష్యత్ రాజకీయాలపై ముందస్తు జాగ్రత్తా?

August 6, 2026

Summarize with AI

---Advertisement---

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తాజా మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి గైర్హాజరయ్యారు. దీంతో వరుసగా మూడో కేబినెట్ సమావేశానికి (Cabinet Meeting) ఆయన హాజరుకాకపోవడం (Not Attending) రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలకు దారితీసింది.

గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా పవన్ హాజరు కాలేదు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కలెక్టర్ల సమావేశాల్లో (Collectors’ Meetings) కూడా ఆయన చాలా వరకు పాల్గొనలేదు. గతంలో జరిగిన రెండు కేబినెట్ సమావేశాల్లో మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటున్నారా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా 2026 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన చాలా కేబినెట్ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనలో మాత్రం పవన్ కళ్యాణ్ చురుకుగా పాల్గొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు వరుసగా దూరంగా ఉండటం కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం గైర్హాజరవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే దీనికి మరో కోణం కూడా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (Andhra Pradesh Cabinet) తన సమావేశాల్లో చట్ట సవరణలు, కొత్త విధానాలు, భారీ ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆమోదిస్తుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలకు విలువైన భూముల కేటాయింపులు, పీపీపీ (PPP) విధానంలో ప్రభుత్వ ఆస్తుల వినియోగం, కొత్త మద్యం విధానం వంటి అంశాలపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న కేబినెట్ నిర్ణయాల్లో తన పాత్ర ఉండకుండా పవన్ కళ్యాణ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం మారితే ప్రస్తుతం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై విచారణలు లేదా వివాదాలు తలెత్తే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసి, ఆ నిర్ణయాలకు తాను హాజరుకాలేదనే రాజకీయ, న్యాయపరమైన అవకాశాన్ని సృష్టించుకుంటున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ వరుసగా కేబినెట్ సమావేశాలకు గైర్హాజరవడానికి గల అసలు కారణాలపై ప్రభుత్వం లేదా జనసేన పార్టీ(Jana Sena Party) నుంచి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రజలకి జవాబుదారిగా ఉండాలని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కీలకమైన కేబినెట్ నిర్ణయాల్లో తన పాత్ర లేకుండా ఎందుకు జాగ్ర జగ్రత్త పడుతున్నారో ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన భాధ్యత ఆయనపై ఉందని పలి వర్గాల నుండి వినిపిస్తున్న మాట.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment