---Advertisement---

నా తండ్రి, సోదరుడిని చంపింది మీరు కాదా?” – పయ్యావుల కేశవ్‌పై విశ్వేశ్వర రెడ్డి ఫైర్

May 25, 2026

Summarize with AI

---Advertisement---

మంత్రి పయ్యావుల కేశవ్‌పై (Payyavula Keshav) వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి (Y. Vishweshwara Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉరవకొండ (Uravakonda) ప్రాంతంలో హత్యా రాజకీయాలకు పునాది వేసింది పయ్యావుల కుటుంబమేనని ఆరోపించారు.

“నా తండ్రి రాకెట్ల నారాయణరెడ్డి(Raketla Narayana Reddy), సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిల (Ravindranath Reddy) హత్యల వెనుక పయ్యావుల కేశవ్ కుటుంబం పాత్ర ఉంది. ఆ హత్యలను (Murders) మేము ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ విశ్వేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా, అక్రమ సారా వ్యాపారాలపై పోరాడిన కారణంగానే తమ కుటుంబాన్ని నాడు పయ్యావుల లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

అలాగే, ప్రస్తుతం వైఎస్ జగన్‌పై (YS Jagan) విమర్శలు చేస్తున్న పయ్యావుల కేశవ్ ముందుగా తన కుటుంబ చరిత్రను తెలుసుకోవాలని హితవు పలికారు. “ఫ్యాక్షన్ రాజకీయాలకు జగన్ వ్యతిరేకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు (Law and Order) మెరుగ్గా ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి” అని విమర్శించారు.

ఉరవకొండ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వర్గ విభేదాలు, పాత హత్యా ఘటనలను ప్రస్తావిస్తూ చేసిన విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment