---Advertisement---

‘పెద్ది’ బాక్సాఫీస్ దండయాత్ర.. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల మోత!

May 8, 2026

---Advertisement---

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా( Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’(Peddi) సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రాన్ని ఇప్పటికే భారీ బ్లాక్‌బస్టర్‌గా అంచనా వేస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్(Advance Bookings) ట్రెండ్ మాత్రం అంచనాలను మించిపోతోంది.

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ జోరు.. నిమిషాల్లోనే భారీ కలెక్షన్లు

నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 30 నిమిషాల్లోనే ఈ చిత్రం 50 వేల డాలర్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. కేవలం 4 గంటల్లోనే లక్ష డాలర్ల మార్క్‌ను అందుకుని కొత్త రికార్డులకు నాంది పలికింది. రిలీజ్‌కు ఇంకా నాలుగు వారాల సమయం ఉండగానే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కావడంతో సామాన్య ప్రేక్షకులు, మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బలంగా కనెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు బుచ్చిబాబు ఎమోషనల్ మేకింగ్ స్టైల్ కలవడంతో బి, సి సెంటర్లలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ‘పెద్ది’కి మరింత ప్లస్ అవుతోంది. దీంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం కనిపిస్తున్న ఓవర్సీస్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. సినిమాకు విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఊహించని స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన హైప్‌ను చూస్తుంటే ‘పెద్ది’ ఈ ఏడాది అతిపెద్ద కమర్షియల్ హిట్‌లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment