---Advertisement---

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..!

July 31, 2026

Summarize with AI

---Advertisement---

బీఆర్ఎస్‌లో(BRS)తీవ్ర విషాదం నెలకొంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే(Narsampet Former MLA), ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) కన్నుమూశారు. గత 7 రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో (Serious Illness) సికింద్రాబాద్‌లోని (Secunderabad) యశోద ఆసుపత్రిలో (Yashoda Hospital)* చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి వార్తతో పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వారం రోజుల క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆకస్మికంగా గుండెపోటు (Heart Attack) రావడంతో తొలుత వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో సీపీఆర్(CPR) చేస్తూ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే సీపీఆర్ నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయినట్లు వైద్యులు వెల్లడించారు. నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించినప్పటికీ ఫలితం లేకపోయింది.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే నర్సంపేట నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి ఉదయం ఆయన భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలించారు. దుగ్గొండి మండలం గిర్ని బావి నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం ముతోజిపేట, ఇటుకలపల్లి, గుండ్లపాడు, రుద్రగూడెం మీదుగా స్వగ్రామం నల్లబెల్లికి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment