అమరావతి రాజధాని (Amaravati Capital) పేరుతో కూటమి ప్రభుత్వం (Alliance Government) తమ భూములను (Lands) బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు (Penumaka Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు భూ సమీకరణ(Land Pooling), మరోవైపు భూసేకరణ (Land Acquisition) ప్రక్రియలను అమలు చేస్తూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. రైతుల పొలాల్లో గుంటలు తవ్వడం, రోడ్లు వేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.
తమ సమస్యలను తామే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ (YS Jagan) దృష్టికి తీసుకెళ్లామని రైతులు తెలిపారు. దీంతో తమ సమస్యలను పరిశీలించేందుకు రైతు పరిరక్షణ కమిటీని (Farmer Protection Committee) ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ కమిటీ సభ్యులు తమ భూములను పరిశీలించేందుకు గ్రామానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ(TDP) నాయకులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు, అడ్డంకులు సమంజసం కాదని రైతులు పేర్కొన్నారు. సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని (CRDA Farmer Protection Committee) తమ భూములను పరిశీలించేందుకు మరోసారి ఆహ్వానిస్తామని తెలిపారు. అవసరమైతే వైఎస్ జగన్ను కూడా తమ గ్రామానికి ఆహ్వానించి పరిస్థితిని ప్రత్యక్షంగా చూపిస్తామని స్పష్టం చేశారు.






