---Advertisement---

నాటి జగన్ దూరదృష్టి… నేడు గురుమూర్తి చొరవతో! పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు.

July 17, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ (Andhra Pradesh Government) వైద్య విద్యను (Medical Education) విస్తరించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Medical Colleges) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దూరదృష్టితో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలను ఇస్తున్నాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ (Anupriya Patel) గారు లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) గారికి పంపిన లేఖలో, పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లతో (MBBS Seats) నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) లెటర్ ఆఫ్ పర్మిషన్ (Letter of Permission – LoP) జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ పరిణామం ద్వారా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకు అవసరమైన అనుమతుల కోసం ఎంపీ మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) గారు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం తన లేఖల ద్వారా వత్తిడి తెస్తూ, ప్రక్రియను వేగవంతం చేయాలని కోరగా, ఇప్పుడు ఎన్‌ఎంసీ (NMC) నుంచి అధికారిక అనుమతి లభించినట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గురుమూర్తికి రాసిన లేక ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

దీంతో నాడు జగన్(YS Jagan) గారి దూరదృష్టితో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాజెక్టు, నేడు మద్దిల గురుమూర్తి గారి చొరవతో కేంద్ర స్థాయిలో కీలక అనుమతులు పొందుతూ కార్యరూపం దాలుస్తోంది. జగన్ గారి విజన్ – గురుమూర్తి గారి చొరవ – పిడుగురాళ్ల ప్రజలకు 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని ఆ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్య అవకాశాలను విస్తరించే శుభపరిణామంగా చెప్పవచ్చు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment