---Advertisement---

గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌తో ప్రజ్ఞానంద చరిత్ర.. తొలి భారతీయుడిగా రికార్డు!

August 28, 2026

Summarize with AI

---Advertisement---

భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద (Rameshbabu Praggnanandhaa) అంతర్జాతీయ చదరంగంలో(International Chess) మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ (Grand Chess Tour) టైటిల్‌ను సొంతం చేసుకుని ఈ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో భారత చదరంగ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లాడు.

తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్, అమెరికా స్టార్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాతో(Fabiano Caruana) ప్రజ్ఞానంద తలపడ్డాడు. 15–13 పాయింట్ల తేడాతో కరువానాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రత్యర్థి కంటే 6 పాయింట్లు వెనుకబడి ఉన్న ప్రజ్ఞానందకు పోరు అంత సులభంగా కనిపించలేదు.

అయితే ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన ప్రజ్ఞానంద వరుసగా 2 ర్యాపిడ్ గేమ్‌లలో(Rapid Games) విజయాలు సాధించాడు. దీంతో పోరులో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ తర్వాత బ్లిట్జ్ విభాగంలోనూ(Blitz Section) తన జోరును కొనసాగిస్తూ కీలక విజయాలు నమోదు చేశాడు.

చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రజ్ఞానంద తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చివరకు 15–13 పాయింట్లతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఛాంపియన్‌గా(Grand Chess Tour Champion) నిలిచాడు. ఈ ఘన విజయంతో సుమారు ₹2 కోట్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు.

ఈ అద్భుత ప్రదర్శనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న గ్రాండ్ చెస్ టూర్‌కు ప్రజ్ఞానంద నేరుగా అర్హత సాధించాడు. వెనుకబడిన స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని టైటిల్‌ను గెలుచుకున్న ప్రజ్ఞానందపై భారత క్రీడా రంగం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment