---Advertisement---

ప్రకాశ్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ.. రంగంలోకి పోలీసులు!

June 21, 2026

Summarize with AI

---Advertisement---

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు (Prakash Raj) బెంగళూరులోని కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో 4 వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ (Non-Bailable Arrest Warrant) జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు కోర్టు సమన్లు, వారెంట్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతో ఈసారి మరింత కఠినంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదును దిలీప్ కుమార్ (Dilip Kumar) అనే వ్యక్తి బెంగళూరులోని మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో 4 వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు (Voter ID Cards) పొందారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదును పరిశీలించిన బెంగళూరులోని 48వ అదనపు ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ కోర్టు కేసును విచారణకు స్వీకరించి చర్యలు ప్రారంభించింది.

ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ విచారణకు హాజరుకాలేదని కోర్టు గుర్తించింది. అనంతరం వరుసగా 2 సార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా స్పందన లేకపోవడంతో తాజాగా మూడోసారి మరో నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయనను కోర్టు ముందు హాజరుపర్చేందుకు పోలీసులు(Police) చర్యలు చేపట్టే అవకాశముందని సమాచారం.

ఇదిలా ఉండగా, వివాదాలు కొనసాగుతున్నప్పటికీ ప్రకాష్ రాజ్ సినీ కెరీర్ మాత్రం బిజీగానే కొనసాగుతోంది. ప్రముఖ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం 3’లో (Drishyam 3) ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ భాగాన్ని కూడా ఇటీవల పూర్తి చేసినట్లు సమాచారం.

దృశ్యం 3తో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆయనకు న్యాయపరంగా ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment