మచిలీపట్నంలో (Machilipatnam) ప్రశ్న రావణ్‌కు (Prashna Ravan) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసిన అనంతరం, మరో కేసులో అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీసులు (Nakkapalli Police) ఆయనను అరెస్ట్ చేసి అక్కడికి తరలించారు. దీంతో రావణ్‌పై నమోదైన కేసుల నేపథ్యంలో వరుస అరెస్టులు(Arrests) కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు పిఠాపురం(Pithapuram), కాకినాడ(Kakinada), మచిలీపట్నం(Machilipatnam) పోలీసుల కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయగా, తాజాగా నక్కపల్లి పోలీసుల అరెస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. రావణ్ ఇప్పటికే నాలుగు సార్లు అరెస్టు కాగా, మూడు కేసుల్లో బెయిల్ పొందిన పరిస్థితుల్లో మళ్లీ మరో కేసులో అరెస్ట్ కావడం రాజకీయంగా, న్యాయపరంగా చర్చకు దారితీస్తోంది.
ప్రశ్న రావణ్ వ్యవహారంలో ప్రభుత్వం పెద్ద తప్పటడుగు వేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రభుత్వానికి శాశ్వత మచ్చగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే సీపీఐ(ఎం)(CPI(M) ప్రభుత్వం ప్రశ్న రావణ్‌పై వేధింపులు నిలిపివేయాలని కోరుతూ ఒక లేఖ విడుదల చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీవ్ర నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కొన్ని జర్నలిస్టు సంఘాలు విమర్శిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
జనసేన పార్టీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఒక వ్యక్తిపై కక్షసాధింపు కోసం పోలీసు వ్యవస్థను వినియోగించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని పలు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రశ్న రావణ్‌ను వెంటనే విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






