ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు (Prepaid Mobile Users) కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో (30 Days Validity) కూడిన రీచార్జ్ ప్లాన్స్(Recharge Plans) అందుబాటులోకి రానున్నాయి. టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్-2026లో(13th Amendment Regulations-2026) ఈ మార్పులు చేసినట్లు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) తెలిపారు.
ఈ కొత్త నిబంధనలతో నెలవారీ రీచార్జ్ విషయంలో వినియోగదారులకు మరింత వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం ఏడాదికి 13 సార్లు రీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉండగా.. 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్స్‌తో 12 రీచార్జ్‌లతోనే ఏడాది పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది. దీంతో రీచార్జ్ ఆప్షన్లు కూడా పెరగనున్నాయి.
డేటా వినియోగం (Data Usage) అవసరం లేని కస్టమర్ల కోసం కేవలం వాయిస్ కాల్స్(Voice Calls), ఎస్ఎంఎస్(SMS Services) సేవలతో కూడిన ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా కాల్స్ కోసం మాత్రమే మొబైల్ ఉపయోగించే తక్కువ బడ్జెట్ వినియోగదారులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
రీచార్జ్ ఆప్షన్లు పరిమితంగా ఉండటంతో వినియోగదారుల నుంచి తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని రాఘవ్ చద్దా వెల్లడించారు. ఈ అంశాన్ని మార్చి 11న పార్లమెంట్‌లో(Parliament) ప్రస్తావించి, వినియోగదారులకు మరిన్ని ఎంపికలతో పాటు అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్స్ అందించాలని కోరినట్లు తెలిపారు.
వినియోగదారుల సౌకర్యం, ఎంపికకు ప్రాధాన్యం ఇస్తూ ఈ మార్పులు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌కు రాఘవ్ చద్దా కృతజ్ఞతలు తెలిపారు.








