---Advertisement---

డీలిమిటేషన్ వెనుక పెద్ద కుట్ర.. లోక్‌సభలో ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు

April 16, 2026

Summarize with AI

---Advertisement---

పార్లమెంట్‌లో (Parliament) మహిళా రిజర్వేషన్ బిల్లుపై (Women’s Reservation Bill) జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ (Congress) నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) కేంద్ర ప్రభుత్వంపై (Central Government) తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్లకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ బిల్లులో చేర్చిన డీలిమిటేషన్ అంశంపైనే తమకు ప్రధాన అభ్యంతరాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు (Full Support) ఇస్తోందని ప్రియాంకా గాంధీ తెలిపారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించడం కాదని, అందులో ఉన్న లోపాలను మాత్రమే బయటపెడుతున్నామని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరిక

డీలిమిటేషన్ (Delimitation) అమలు ప్రస్తుత రూపంలో జరిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రియాంకా గాంధీ హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు.

రాబోయే ఎన్నికల్లో రాజకీయ లాభం కోసమే కేంద్రం ఈ అంశాన్ని ముందుకు తెస్తోందని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతూ స్వతంత్ర సంస్థలను ప్రభావితం చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు.

ఓబీసీ మహిళలకు (OBC Women) రిజర్వేషన్లలో సరైన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసిన ప్రియాంకా గాంధీ, దేశంలో కులగణన ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం కులగణన అవసరమని ఆమె పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment