---Advertisement---

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు

May 22, 2026

Summarize with AI

---Advertisement---

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను (Rajya Sabha Elections Schedule) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. జూన్, జూలై నెలల్లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) 4 స్థానాలు ఖాళీ కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 4 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం.. జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది.

దేశ రాజకీయాల్లో కీలక నేతల పదవీకాలం కూడా ఈసారి ముగియనుంది. కర్ణాటక (Karnataka) నుంచి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ పదవీకాలం పూర్తవుతోంది. అలాగే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పదవీకాలం కూడా ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీ, సాన సతీష్ బాబులకు చెందినవే.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే గుజరాత్‌లో (Gujarat) 4 స్థానాలు, కర్ణాటకలో 4 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలు, జార్ఖండ్‌లో (Jharkhand) 2 స్థానాలు, మణిపూర్‌లో (Manipur) 1 స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment