---Advertisement---

మాజీ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ రాకేష్ మెహతా ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు!

September 9, 2026

Summarize with AI

---Advertisement---

మాజీ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ(Former Delhi Chief Secretary), 1975 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా(Rakesh Mehta) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. 74 ఏళ్ల రాకేష్ మెహతా నోయిడాలోని(Noida) సెక్టార్ 82లో ఉన్న కేంద్రీయ విహార్-2 సొసైటీలోని (Kendriya Vihar-2 Society) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందారు. సెప్టెంబర్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భర్త ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించకపోవడంతో ఆయన భార్య సుమంతి మెహతా (Sumathi Mehta) పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫేజ్-2 పోలీసులు ఇంటికి చేరుకోగా తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు రాకేష్ మెహతా మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మానసిక, ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో (Suicide Note) పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఆయన భార్య కుమారుడి వద్ద డెహ్రాడూన్‌లో(Dehradun) ఉన్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాకేష్ మెహతా 2007 నుంచి 2010 నవంబర్‌లో పదవీ విరమణ చేసే వరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (Sheila Dikshit) హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీకాలంలోనే 2010 కామన్వెల్త్ క్రీడలు ఢిల్లీలో జరిగాయి. రవాణా, విద్యుత్, మౌలిక వసతులకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

పోస్ట్‌మార్టం అనంతరం రాకేష్ మెహతా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, సోమవారం లోధి రోడ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment