స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావణ్‌ను (Ravan) పోలీసులు కోర్టుకు తరలిస్తున్న సమయంలో జనసేన నాయకులు (Jana Sena Party Leaders), కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ముందుకు కదలకుండా నిరోధించడమే కాకుండా, దానిపై కోడిగుడ్లతో దాడి (Eggs Attack) చేయడంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావణ్‌ను కోర్టులో హాజరుపరిచారు. అయితే జనసేన కార్యకర్తల వ్యవహారంతో కాకినాడ (Kakinada) ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని , కార్యకర్తల అత్యుత్సాహంపై స్థానిక ప్రజలు తీవ్రంగా మండిపడినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే పిఠాపురం కోర్టు (Pithapuram Court) రావణ్‌కు బెయిల్(Bail) మంజూరు చేసిన నేపథ్యంలో, తాజాగా కాకినాడ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, బెయిల్ వచ్చినప్పటికీ రావణ్‌ను విడుదల చేయకుండా మరో కేసులో(Case) మరో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే రావణ్ నిరాహార దీక్ష చేపట్టినట్లు సమాచారం. వరుసగా నమోదవుతున్న కేసులు, బెయిల్ వచ్చినప్పటికీ విడుదలలో జాప్యం వంటి అంశాలపై ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రావణ్‌పై సుమారు 35 పోలీస్ స్టేషన్లలో జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించారని, ఒకే తరహా ఆరోపణలతో పలు పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు చేసి ఆయనను మానసికంగా వేధించే ప్రయత్నం జరుగుతోందని రావణ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు లేదా జనసేన నాయకత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.






