---Advertisement---

రేవంత్‌ రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం: కేటీఆర్‌ విమర్శలు

May 31, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో (Telangana) రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని (Congress Party) రాజకీయంగా పూర్తిగా తిరస్కరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేమెంట్‌ కోటాలో సీఎం పదవిని దక్కించుకున్నారని, ఆయన రెగ్యులర్‌ సీఎం (Regular CM) కాదని, రెన్యువల్‌ సీఎం (Renewal CM) అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు (Indira Park) వద్ద జీవో 17 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కేటాయించిన టెండర్ల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు జీవో 17 ద్వారా చిన్న కాంట్రాక్టర్ల అవకాశాలను కూడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జీవో 17ను పూర్తిగా రద్దు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రధాన కాంట్రాక్టులు సీఎం రేవంత్‌రెడ్డి బంధువులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కుటుంబ సభ్యులు, బీజేపీ(BJP) నాయకులకు దక్కుతున్నాయని కేటీఆర్‌(KTR) ఆరోపించారు. 2028లో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 50 వేల మంది కొత్త కాంట్రాక్టర్లను తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్‌ మందా శ్యామ్‌తో పాటు పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

ఒక్క ఇల్లయినా కట్టావా? అంటూ రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో ఒక్క ఇల్లయినా నిర్మించారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. అయితే ఎంత మంది పేదల ఇళ్లను కూల్చి వారి జీవితాలను నాశనం చేశారో ప్రజలకు తెలుసని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో (Musheerabad Constituency) ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ (Mutha Gopal) అధ్యక్షతన నిర్వహించిన బూత్‌ లెవల్‌ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 30 నెలలు గడిచినా హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

గతంలో 100 రోజుల్లో గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తే బలమైన పహిల్వాన్‌కైనా 3 నెలల్లో పిల్లలు పుడతారా అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేసిన కేటీఆర్‌.. ఇప్పుడు 30 నెలలు పూర్తయినా ఫలితాలు కనిపించకపోతే ప్రజలు ఏమనుకోవాలని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్‌(KCR), కేటీఆర్‌లను(KTR) ఓడిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారని కేటీఆర్‌ అన్నారు. కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు తమకు ఇచ్చిన హామీల గురించి అడగడానికి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఎక్కడ కనిపిస్తారా అని ఎదురు చూస్తున్నారని విమర్శించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్‌, దేశపతి శ్రీనివాస్‌, సురభివాణిదేవి, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment