జమిలి ఎన్నికలపై (Jamili Elections) తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(A. Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ (BJP) ఎన్నికల విధానం జెమిని సర్కస్‌లా ఉందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎస్ఐఆర్ను(SIR) బీజేపీ రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆరోపించిన సీఎం.. ఏ రాష్ట్రంలో గెలవాలనుకుంటే అక్కడే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కేరళలో(Kerala) 3 సీట్లు, తమిళనాడులో(Tamil Nadu) 2 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ.. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్లపై (Women Reservations) కూడా సీఎం స్పందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపుపై ఇంకా స్పష్టమైన ఫార్ములా లేదని తెలిపారు.
కాంగ్రెస్ పేరు లేకుండా బీజేపీ బతకదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. ప్రజాస్వామ్యంపై బీజేపీకి నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణ స్వీకారం (Anti-Drug Pledge) కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు.
రైతుల సమస్యలపై (Farmers Issues) కూడా సీఎం స్పందించారు. అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.






