---Advertisement---

ఆర్జీవీ ఈజ్ బ్యాక్.. ముంబై మాఫియాపై మాస్ మూవీ ప్రకటన..!

August 11, 2026

Summarize with AI

---Advertisement---

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి తనకు బాగా కలిసొచ్చిన మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో(Mafia Backdrop) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ముంబై అండర్‌వరల్డ్(Mumbai Underworld), గ్యాంగ్‌వార్‌లంటే (Gang Wars) ఆర్జీవీకి (RGV) ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే జానర్‌లో(Genre) ‘పోలీస్ కంపెనీ’(Police Company) పేరుతో కొత్త సినిమాను ప్రకటించి సినీ అభిమానుల్లో ఆసక్తి పెంచేశారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్(T-Series) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరో హర్షవర్ధన్ రాణే (Harshvardhan Rane) ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. 1990ల చివర్లో, 2000వ దశకం ప్రారంభంలో ముంబైలో గ్యాంగ్‌వార్‌లు మితిమీరడంతో వాటిని కంట్రోల్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఓ ప్రత్యేక పోలీస్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ స్క్వాడ్ స్ఫూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు.

ఈ సినిమాలో ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అధికారి దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే(Harshvardhan Rane) కనిపించనున్నారు. డీ-కంపెనీ కంటే ఇది చాలా ప్రమాదకరమైనది అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రాబోతుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే హర్షవర్ధన్ రాణే ఫస్ట్ లుక్‌ను ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ముంబై గ్యాంగ్‌వార్‌లపై ఆసక్తికరమైన పోస్ట్..

ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆర్జీవీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్‌లను దారుణంగా అంతం చేసిన తర్వాత తన గ్యాంగ్‌ను ఒక కంపెనీగా మార్చాడని తెలిపారు. ఆ తర్వాత తన కార్యకలాపాల బాధ్యతలను ఛోటా రాజన్‌కు అప్పగించి దుబాయ్ వెళ్లిపోయాడని పేర్కొన్నారు.

అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim), ఛోటా రాజన్(Chhota Rajan) మధ్య విభేదాలు మొదలయ్యాయని, దీంతో ముంబై అండర్‌వరల్డ్‌లో ఆధిపత్య పోరు మరింత ముదిరిందని ఆర్జీవీ వివరించారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పలు గ్యాంగ్‌లు రంగంలోకి దిగాయని తెలిపారు.

యూపీ(UP), మధ్యప్రదేశ్(Madhya Pradesh), బిహార్(Bihar) వంటి ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు కూడా ముంబై అండర్‌వరల్డ్‌లోని పలు గ్యాంగ్‌లతో చేతులు కలిపారని ఆర్జీవీ పేర్కొన్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో అప్పటి ప్రభుత్వం ఓ ప్రత్యేక పోలీస్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు.

1997 నుంచి 2004 మధ్య ఈ స్పెషల్ స్క్వాడ్ 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్లను హతమార్చినట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మాఫియా గ్యాంగ్‌లకు (Mafia Gangs) మధ్య జరిగిన పోరాటాన్ని సినిమాలో పవర్‌ఫుల్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు క్రైమ్, మాఫియా కథలతో తనకంటూ ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు మరోసారి తన ఫేవరెట్ జానర్‌లోకి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ‘పోలీస్ కంపెనీ’లో నటించబోయే మిగతా నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక ఆర్జీవీ ప్రస్తుతం ‘పోలీస్ స్టేషన్‌లో భూత్’ (Police Station Lo Bhoot)పేరుతో మరో హారర్ కామెడీ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. వరుస సినిమాలతో ఆర్జీవీ మళ్లీ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment